Share News

వాణిజ్య ఒప్పందంపై చర్చలకు వచ్చేవారం అమెరికాకు భారత బృందం

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:38 AM

వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు భారత ప్రతినిధి బృందం వచ్చేవారం అమెరికాలో పర్యటించనుంది. ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్‌లో ...

వాణిజ్య ఒప్పందంపై చర్చలకు వచ్చేవారం అమెరికాకు భారత బృందం

  • అమెరికా సుంకాల విధానంలో మార్పులనేపథ్యంలో సవరణలకు ప్రాధాన్యం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు భారత ప్రతినిధి బృందం వచ్చేవారం అమెరికాలో పర్యటించనుంది. ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్‌లో ఈ అంశంపై కీలక సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. తుది ఒప్పందం మార్చిలోనే కుదురుతుందని ఇరుదేశాలు భావించినప్పటికీ.. ట్రంప్‌ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదా పడింది. ఆ తర్వాత అమెరికా సుంకాల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు అన్ని దేశాలపై 10ు సుంకాలను అమెరికా విధిస్తోంది. అమెరికా సుంకాల విధానంలో మార్పుల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఖరారైన మధ్యంతర ఒప్పందాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. అమెరికా మార్కెట్లో భారత్‌కు మరింత ప్రయోజనం కలిగే విధంగా ఒప్పందాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.

Updated Date - Apr 16 , 2026 | 03:38 AM