ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
ABN , Publish Date - Apr 19 , 2026 | 07:17 PM
ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎల్ఎస్‌జీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎల్ఎస్‌జీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్.. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచుల్లో రెండు గెలిచి 8వ స్థానంలో కొనసాగుతోన్న లఖ్‌నవూ గెలవాలనే కసితో ఉంది. ఈ కీలక పోరులో పై చేయి ఎవరిదో చూడాల్సి ఉంది.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానోలి, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, నేహార్ వధేరా, మార్కస్ స్టోయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: విజయకుమార్ వైశాఖ్, హర్పీత్ బ్రార్, సుర్యాంశ్, యశ్ ఠాకూర్, విష్ణు వినోద్
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తుది జట్టు
ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, ముకుల్ చౌదరి, షమి, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మానిమరన్ సిద్ధార్ధ్, మొహ్సిన్ ఖాన్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: అబ్దుల్ సమద్, దిగ్వేశ్ సింగ్ రాఠి, మ్యాథ్యూ, మయాంక్ యాదవ్, హిమ్మత్ సింగ్
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవివత్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం!