Share News

ఐపీఎల్ 2026: బౌలర్లదే హవా.. ఆర్సీబీ టార్గెట్ 147

ABN , Publish Date - Apr 15 , 2026 | 09:29 PM

ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. సొంతగడ్డపై ఆర్సీబీ బౌలర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది.

ఐపీఎల్ 2026: బౌలర్లదే హవా.. ఆర్సీబీ టార్గెట్ 147
RCB vs LSG

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. సొంతగడ్డపై ఆర్సీబీ బౌలర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీకి 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. రసిక్ సలామ్ దార్ 4 వికెట్లతో చెలరేగిన వేళ.. లఖ్‌నవూ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఓపెనర్ మిచెల్ మార్ష్(40) టాప్ స్కోరర్.


ఆయుశ్ బదోని(38), ముకుల్ చౌదరి(39) పర్వాలేదనిపించారు. ఐడెన్ మార్క్‌రమ్(12) పరుగులు చేశాడు. వీరు మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మోచేతి గాయం కారణంగా కెప్టెన్ రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తిరిగొచ్చినా కూడా లాభం లేకపోయింది. ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగే చేసి తిరిగి పెవిలియన్ చేరాడు. నికోలస్ పూరన్(1) మరోసారి నిరాశపర్చాడు. అబ్దుల్ సమద్(0), జార్జ్ లిండే(7), షమి(0), ఆవేశ్ ఖాన్(1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ దార్ 4, భువనేశ్వర్ కుమార్ , కృనాల్ పాండ్య 2, హేజిల్‌వుడ్ 1 వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి:

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్

ఆ విషయం నాకు సంతృప్తినిచ్చింది: అజింక్య రహానే

Updated Date - Apr 15 , 2026 | 09:29 PM