Home » Kurnool
కర్నూలు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
కర్నూల్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని దగ్ధం కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అయితే, ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ కొందరు ప్రయాణికులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించిన ఓ స్థానికుడు తన మానవత్వం చాటుకున్నాడు.
కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారని తెలిపారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పోలీసుల కస్టడీలో ఉన్నారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా..
బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు.. కలెక్టరేట్లో: 08518-277305, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059, ఘటనాస్థలి వద్ద: 91211 01061.
రవాణా శాఖలో ప్రయాణికుల భద్రతే ముఖ్యం కావాలని రాహుల్ గాంధీ సూచించారు. వాహనాలను తగిన విధంగా మెయింటైన్ చేయాలని చెప్పారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పటాన్చెరుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారి తల్లి ఫిలో మినన్ బేబీ, కుమారుడు కిషోర్ కుమార్ ఉన్నారు.
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం కావడం అందరినీ కలచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో బెంగళూరులో స్థిరపడ్డాడు. అయితే ఇటీవల రమేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి.. గత రాత్రి ట్రావెల్స్ బస్సులో బెంగుళూరుకు పయనమయ్యాడు.
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు దగ్గర బైకు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.