హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:14 AM
సమాజ శ్రేయస్సు కోసం.. సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని ఆర్లబండ మహా పీఠాధిపతి మర్రిస్వామి తాత, కామవరం పీఠాధిపతులు బ్రహ్మనిష్ట స్వామి, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు రాఘవేంద్ర అన్నారు.
కోసిగి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సమాజ శ్రేయస్సు కోసం.. సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని ఆర్లబండ మహా పీఠాధిపతి మర్రిస్వామి తాత, కామవరం పీఠాధిపతులు బ్రహ్మనిష్ట స్వామి, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు రాఘవేంద్ర అన్నారు. ఆదివారం కోసిగిలో హిందు యువత ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం కోసిగి తేరుబజారు మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోసిగి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల నుంచి సుమారు 2వేల మందికి పైగా హిందువులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పీఠాధిపతి మర్రిస్వామి తాత మాట్లాడుతూ స్వామి వివేకానంద హిందే ధర్మం కోసం అప్పట్లోనే విదేశీయులతో పోరాడారనీ, పురానాలు, ఇతిహాసాలు, సాంప్రదాయాల ప్రారంభంతో సనాతన ధర్మం ప్రారంభమైందని, ఈ ధర్మం ప్రతిరూపమే హిందూ సమ్మేళనమని అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పాటించినప్పుడే ధర్మం నడుస్తుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అద్యక్షులు ఆలూరు రాఘవేంద్ర మాట్లాడుతూ హిందూ దేశంలో పుట్టి కొంత మంది ప్రజలను మభ్య పెడుతున్నారని, బలవంతంగా మతాలను మార్చేందుకు కొందరు ఇతర మతస్థులు పూనుకుంటున్నారనీ, వాటిని హిందువులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కామవరం పీఠాధిపతి శోస్త్రీయ బ్రహ్మనిష్ట స్వామి మాట్లాడుతూ ప్రతి మనిషి వారి విధానాలు అలవర్చుకోవాలని, అప్పుడే సంప్రదాయం ఉంటుందని అన్నారు. బాలికలు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. కోసిగికి చెందిన బోయ తనూజ భరతనాట్యంతో దుర్గాదేవి నృత్యప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం ఆదోని, కోసిగి చెందిన బాలబాలికలు నృత్యప్రదర్శనలు అలరించాయి. భోజన సౌకర్యాం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.