త్రో బాల్ పోటీల్లో కౌతాళం జట్టు విజయం
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:08 AM
జిల్లా స్థాయి ఉపాధ్యాయినుల త్రోబాల్ పోటీలలో కౌతాళం ఉపాధ్యాయుల జట్టు విజేతగా నిలిచినట్లు ఎంఈవో-1, 2లు రామాంజనేయులు, శోభారాణి తెలిపారు.
కౌతాళం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లా స్థాయి ఉపాధ్యాయినుల త్రోబాల్ పోటీలలో కౌతాళం ఉపాధ్యాయుల జట్టు విజేతగా నిలిచినట్లు ఎంఈవో-1, 2లు రామాంజనేయులు, శోభారాణి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ఉపాధ్యాయులకు ఆట పోటీల నిర్వహణను ప్రభుత్వం నిర్వహించగా కౌతాళం మండలం నుంచి మహిళా ఉపాధ్యాయునిలు త్రోబాల్ పోటీలలో పాల్గొన్నారు. ఆదివారం కర్నూలులో జిల్లా స్థాయి త్రోబాల్ ఫైనల్ మ్యాచ్‌లో కౌతాళం జట్టు, కర్నూలు జట్ట పోటీ పడగా కౌతాళం జట్టు విజేతగా నిలిచిందన్నారు. గెలుపొందిన జట్టుకు ట్రోఫితో పాటు ప్రశంస పత్రాలను జిల్లా అధికారులు అందజేసినట్లు తెలిపారు. విజేతగా నిలిచిన జట్టు సభ్యులను ఎంఈఓలు అభినందించారు.