జనసేన బలోపేతానికి కృషి
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:31 AM
జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ మంత్రాలయం ఇన్ చార్జి బి. లక్ష్మన్న తెలిపారు.
మంత్రాలయం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ మంత్రాలయం ఇన్ చార్జి బి. లక్ష్మన్న తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులతో శనివారం మంత్రాలయం లోని తన నివాసంలో లక్ష్మన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల అధ్యక్షులు వీరారెడ్డి, బజారి, బీవీ రవిచంద్ర, నాయకులు అనుమేష్, అలీబాషా, గోపాల్, మహదేవ్, ఈరన్న, యోసేపు, అయ్యప్ప, చెన్నబసప్ప, బంగారయ్య, రాజశేఖర్, చెన్నారెడ్డి, గిడ్డయ్య, వరప్రసాద్, దుళ్లయ్య తదితరులు పాల్గొన్నారు.