నేడు టీడీపీ అఽధ్యక్ష బాధ్యల్లోకి గుడిసె క్రిష్ణమ్మ
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:03 AM
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు గుడిసే క్రిష్ణమ్మ స్వీకరిస్తారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు.
కర్నూలు అర్బన్ , డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి) : జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు గుడిసే క్రిష్ణమ్మ స్వీకరిస్తారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలుదేరి కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు త రలి రావాలని కోరారు.