ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదాం
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:33 AM
గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్ రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు.
మంత్రాలయం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతగా తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్ రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మాధవరం జడ్పీ హైస్కూల్‌లో ఎంపీడీవో నూర్జహాన్, డిప్యూటీ ఎంపీడీవో రామాంజినేయులు, ఎంఈవో మైనుద్దీన్, హెచ్‌ఎం బోజరాజు గ్రామ కార్యదర్శి వేణుగోపాల్, ఐసీడీఎస్ సీడీపీవో రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో మురుగుదొడ్లు, తాగునీటి కొళాయిల వద్ద పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా సభా వేదిక ఏర్పాటు చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రాజారెడ్డి, సురేష్ నాయుడు, వెంకటపతిరాజు, అడివప్ప గౌడు, సీఆర్‌పీ బంగారప్ప, హెచ్‌ఎంలు రామ్మోహన్, నీలకంఠ స్వామి, జగదీశ్, టిప్పుసుల్తాన్, కేశన్న, నాగరాజు, అంజినయ్య, సుమిత్రమ్మ, విశాలాక్షి, అనిత, తులసమ్మ, మాధురి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
గోనెగండ్ల: పచ్చని ప్రకృతితోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, మాజీ ఎంపీపీ హనుమంతు, మాజీ సర్పంచ్ సంజన్న అన్నారు. గాజులదిన్నె గ్రామంలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కింద గ్రామంలోని పలు వీధులలో పంచాయతీ, సచివాలయ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్‌స్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, గ్రామ ప్రజలతో కార్యదర్శి మద్దిలేటి స్వచ్ఛఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. గాజులదిన్నె మత్స్య సంఘం అధ్యక్షుడు రంగస్వామి నాయుడు, వే ణుగోపాలచారి, జయరాముడు, టీడీపీ నాయకుడు చంద్ర, కాంట్రాక్టర్ నాగన్న, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.