ఎమ్మిగనూరు నుంచి నన్ను దూరం చేయలేరు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:12 AM
ఎమ్మిగనూరు ప్రజలు నన్ను ఆదరించారు.. వారి నుంచి, ఎమ్మిగనూరు నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరని వైసీపీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు.
ఎమ్మిగనూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు ప్రజలు నన్ను ఆదరించారు.. వారి నుంచి, ఎమ్మిగనూరు నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరని వైసీపీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. పట్టణంలోని బుట్టా రేణుక కార్యాలయంలో ఆదివారం మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. బుట్టా రేణుక మాట్లాడుతూ ఎందరికో ఎదురోడ్డి నిడబడ్డానని అన్నారు. రెండేళ్లు ఎంతో ఆదరించారని, తప్పని పరస్థితుల్లో అన్న(జగన్)మాట కాదనలేక, ఇటు మీ అభిమానం వదులుకోలేక పోతున్నానని అన్నాను. మళ్లీ మీ దగ్గరికే తనను మీ అభిమానమే చేరుస్తుందని అన్నారు. పార్లమెంటు సమన్వయకర్తగా ఇచ్చినా కూడా.. ఎమ్మిగనూరు పార్లమెంటులో భాగం కావడంతో నన్ను మీ నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరు అంటూ ఆమే చేసిన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాబోయే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బుట్టా రేణుక అంటూ ఆమే వర్గీయులు నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుక ఎమ్మిగనూరు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందంటూ ఆమె వర్గీయులు చర్చించుకుంటున్నారు.