Share News

నేరాల నివారణే లక్ష్యం

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:12 AM

జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు.

   నేరాల నివారణే లక్ష్యం
నేర సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ విక్రాంత పాటిల్‌

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా

ఉద్యోగాల పేరుతో మోసాలు చేసేవారిపై కేసులు నమోదు చేయండి

పోలీ్‌సస్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం చేయండి

కొత్త సంవత్సరంలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి

ఎస్పీ విక్రాంత పాటిల్‌

కర్నూలు క్రైం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి వారి లోకేషన్లను జియో ట్యాగింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి నుంచి ప్రతి రౌడీషీట్స్‌ను, సస్పెక్ట్స్‌ షీట్లను మొత్తం సమాచారం (ఫొటోలు, ఆధార్‌, బ్యాంకు వివరాలు, లోకేషన్స, జియో ట్యాగింగ్‌, ఫోన నెంబర్ల)ను సీసీటీఎనఎ్‌సలో అప్‌లోడు చేయాలన్నారు. ఎవరైనా ఉద్యోగాల పేరుతో మోసాలు, ల్యాండ్‌ మాఫియా చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. 2015 నుంచి 2025 వరకు పది సంవత్సరాల నుంచి ఎలాంటి కేసులు నమోదు కాకుండా సమస్యలు లేకుండా ఉన్న రౌడీషీటర్లను బాగా రివ్యూ చేయాలన్నారు. మంచి నడవడిక కలిగిన రౌడీషీటర్లను రౌడీ షీట్‌ నుంచి తొలగించేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గించాలని, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్‌ కేసులు తగ్గించాలని ఆదేశించారు. మహిళలపై నేరాలు జరగకుండా నేర నివారణే ప్రథమ లక్ష్యంగా పని చేయాలన్నారు. పోలీ్‌సస్టేషన్లను ఆశ్రయించే బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఫోక్సో, బాలికల మిస్సింగ్‌,, గ్రేవ్‌ కేసుల గురించి ఆరా తీశారు. వచ్చే కొత్త సంవత్సరం నుంచి పోలీసులు బాగా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఓపెన డ్రింకింగ్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతికేసులో ఈసాక్ష్య యాప్‌ను బాగా వినియోగించుకోవాలన్నారు. కోర్టులో ఉన్న పెండింగ్‌ కేసులను త్వరగా ట్రయల్‌కు వచ్చే విదంగా కృషి చేయాలన్నారు. విజిబుల్‌ పాలిసింగ్‌ బాగా చేయాలన్నారు. ఉలిందకొండ పరిధిలో ఏటీఎం చోరీకి ప్రయత్నించిన కేసులో డీజీపీ నుంచి ఏబీసీడీ అవార్డు పొందిన పోలీసులను, గత నెలలో వివిద కేసుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అడిషినల్‌ ఎస్పీలు హుశేన పీరా, కృష్ణమోహన, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జున రావు, డీఎస్పీలు, బాబు ప్రసాద్‌, వెంకట్రామయ్య, హేవ,ులత, భార్గవి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 12:12 AM