హాస్టల్ వార్డెనపై కలెక్టర్ ఆగ్రహం
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:08 AM
విద్యార్థులు దేవాలయంగా భావించే హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వసతుల నిర్వహణపై అసంతృప్తి
మంత్రాలయం/కోసిగి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు దేవాలయంగా భావించే హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హాస్టల్ నిర్వహణ ఇలాగేనా’ అంటూ ప్రశ్నించారు. మంగళవారం కలెక్టర్ మంత్రాలయం కోసిగి ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రాలయంలో పాఠశాలలతో పాటు సచివాలయాలు, రెవెన్యూ కార్యాలయాలను తనిఖీ చేశారు. నాగలదిన్నె రోడ్‌లో నల్లవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఎమ్మిగనూరు రోడ్డులో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డితో కలిసి ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో పర్యటించారు. రోడ్లు, మురికికాల్వలు, విద్యుత దీపాలు, తాగునీరు లేవని చెప్పడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు రోజుల్లో కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా కోసిగి మండలంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను కలెక్టర్ తనిఖీ చేసి హాస్టల్ పరిసరాల పరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. దుర్వాసన వస్తుండటంతో పంచాయతీ సిబ్బంది, కార్యదర్శిపై, హాస్టల్ వార్డెనపైన ఆగ్రహించారు. హాస్టల్ పక్కనే ఓ పంది పిల్ల చనిపోయి దుర్వాసన వస్తోందని కలెక్టర్‌కు విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సమస్యను క్లియర్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ చిరంజీవి, డీపీవో భాస్కర్, తహసీల్దార్లు రమాదేవి, వేణుగోపాల్ శర్మ, ఎంపీడీవోలు నూర్జహాన మహబూబ్ బాషా, డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వరయ్య స్వామి, ఆర్‌డబ్లూఎస్ ఏఈ తిమ్మరాజు, హౌసింగ్ డిప్యూటీ ఇంజనీర్ లాల్ స్వామి, ఏఈ స్వరూప్, ఆయా శాఖల అధికారులు, ఏఎ్‌సఐ నాగరాజు ఉన్నారు.