Home » Kurnool
కర్నూలు వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారకుడైన బైకర్ శివశంకర్ బెల్ట్ షాపులో మద్యం తాగాడంటూ వైసీపీకి అనుకూలమైన బ్లూ మీడియాతో సహా కొన్ని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది వైసీపీ అనుకూల మీడియా. అయితే, ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై ప్రభుత్వం సీరియస్ అయింది.
చిన్నటేకూరు బస్సును బైక్‌తో ఢీకొని మృతిచెందిన శివ శంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివ శంకర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 281,125(A), 106(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఓ ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మండలంలోని పెద్దనేలటూరు గ్రామ శివారులో శనివారం సాయంత్రం ఆర్టీసీ విద్యార్థి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడబోయి ఒక సైడ్‌కు ఒరిగింది.
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబైకి చెందిన అశోక్ భట్ అనేభక్తుడు 10.50 క్వింటాళ్ల బియ్యం, 500 గ్రాముల వెండి వస్తువులు, రూపశెట్టి అనేభక్తురాలు 2.50 క్వింటాళ్ల బియ్యం విరాళంగా ఇచ్చినట్లు మఠం అధికారులు తెలిపారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బోయ నరసింహులు ఇటీవల వేలూరులో జరిగిన రాష్ట్రస్థాయి పరుగు పందెంలో మూడు బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు.
కర్నూలులో కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19మంది చనిపోయారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్.. బస్సు ప్రమాద ఘటనపై కీలక విషయాలను వెల్లడించారు.
కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వేమూరి కావేరి సంస్థకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సులో ప్రయాణిస్తున్న19 మంది ప్రయాణికులు మృతిచెందారు.
కర్నూలు జిల్లాలో నిన్న(శుక్రవారం) జరిగిన ఘోర బస్సు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 19మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. ఇదే సమయంలో ప్రైవేటు బస్సుల డ్రైవర్లపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ప్రస్తుతం బైకర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్‌లో శివశంకర్ ఉన్న వీడియో బయటకు వచ్చింది.