Share News

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:17 AM

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప అన్నారు.

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌
చెక్కులు అందజేస్తున్న చెన్నబసప్ప

కౌతాళం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప అన్నారు. మండలంలోని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి నిధి కింద మంజూరైన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం కౌతాళంలో టీడీపీ నాయకులతో కలిసి అందజేశారు. చెన్నబసప్ప మాట్లాడుతూ కౌతాళానికి చెందిన యడవల్లి కిరణ్‌ కుమార్‌కు రూ.3,37,069, పొదలకుంట గ్రామానికి చెందిన పూజారి మహంతమ్మకు రూ.80,000, చూడి గ్రామానికి చెందిన కమ్మారి మౌనేష్‌కు రూ.35,700 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరుకాగా వాటిని కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు. టీడీపీ జిల్లా నిర్వాహక కార్యదర్శి కోట్రేశ్‌గౌడ్‌, డొమ్మలదిన్నె రమేశ్‌గౌడ్‌, శివప్పగౌడ్‌, దొడ్డనగౌడ్‌, కురుగోడు, బాపురం వెంకటరెడ్డి, సిద్ధు, మంజు ఉన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 12:17 AM