నియోజకవర్గ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:15 AM
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు.
ఎమ్మిగనూరు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ఎమ్మిగనూరు-కంబళదిన్నె రోడ్డును రూ. 5కోట్ల నిధులతో శుక్రవారం ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరుకు జాతీయ రహదారి తీసుకొస్తామన్నారు. గతంలో తన తండ్రి బీవీ మోహన్ రెడ్డి వేశారని, ప్రస్తుతం ఆయన తనయుడిగా నేడు ఈ రోడ్డు వేస్తున్నానని సగర్వంగా చెప్పుకుంటున్నానని అన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా? అని అడిగారు. ఎన్నికల సమయంలో మాత్రమే వస్తారని విమర్శించారు. నష్టపోయిన ఉల్లిపంటకు నష్టపరిహారం ఇస్తున్నామన్నారు. రైతులు ఇబ్బంద పడకుండా ఉల్లిరైతులకు, పత్తి రైతులనుంచి సీసీఐ ద్వారా కొనుగోలు చేయించిన ఘనత సీఎం చంద్రబాబుదే అని అన్నారు. 18నెలలు తిరగకుండానే అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఉనికికోసం వైసీపీ నానా పాట్లు పడుతోందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ నాగరాజు, ఏఈ విజయ్ నరేష్, ప్రభు, కుర్ణి కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప, టీడీపీ నాయకులు ఎంబీ మహేశ్, దేవేంద్ర, పట్టా నాగరాజు, శివకుమార్, శాభీర్, ముల్లా కలీముల్లా, యూకే వీరేంద్ర, రంగస్వామి గౌడ్, కటారి రాజేంద్ర, బుగిడే నాగరాజు, నరసింహులు, మల్లి, జయన్న, షాలేమ్, బీజేపీ నాయకుడు చిన్న ఈరన్న, జనసేన నాయకులు రవి, నవీన్, విజయలక్ష్మి పాల్గొన్నారు.