Share News

ఆదోని జిల్లా ప్రకటించే దాకా పోరాటం

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:50 PM

ఆదోనిని జిల్లా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని ఆదోని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్‌ నూర్‌ అహ్మద్‌ అన్నారు.

ఆదోని జిల్లా ప్రకటించే దాకా పోరాటం
మాట్లాడుతున్న నూర్‌ అహ్మద్‌

కోసిగి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఆదోనిని జిల్లా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని ఆదోని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్‌ నూర్‌ అహ్మద్‌ అన్నారు. గురువారం కోసిగిలోని ఆర్టీసీ బస్టాండు ముందు ఆదోని జిల్లా సాధన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా కోసం సుమారు 50 రోజుల నుంచి జిల్లా సాధనే లక్ష్యంగా 5 నియోజకవర్గాల ప్రజలు ఉద్యమం అమోఘమని, ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం దృష్టికి ఆదోని జిల్లా చేయాలని వార్త చేరిందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం.రాజు, కోసిగయ్య, కరీం స్వామి, నాగేష్‌, ప్రతాప్‌, ప్రకాష్‌, రాము, హుశేన్‌బాషా ఉన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 11:51 PM