Share News

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:40 PM

విద్యార్థి దశ లోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదల, తపనతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించొచ్చని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: కలెక్టర్‌
మహిళా ఉపాధ్యాయులను సన్మానించిన కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థి దశ లోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదల, తపనతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించొచ్చని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శనివారం పట్టణంలోని బొమ్మల సత్రం సమీపంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను స్వయంగా పరిశీలించి, పాఠ్యాంశాలపై విద్యార్థులతో చర్చిం చారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన సూచనలి చ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమావేశమై రాబోయే పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలబెట్టాలన్నారు. అంతకుముందు సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని 281 పాఠశాలల్లో పదోతరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. పాఠశాలలకు అన్ని శాఖల అధదికారులను నియమించి నిరంతర పర్యవేక్షణలు నిర్వహిం చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులోనే భాగంగా తన కు కేటాయించిన ఏపీ మోడల్‌ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో అభ్యాసన పద్ధతులపై ముచ్చటించినట్లు చెప్పారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా స్థాయి స్పెల్‌ బీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు లోకేశ, షారాలను జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందిం చారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీఓ నిత్యా నందరాజు, ప్రిన్సిపల్‌ మల్లికార్జునప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:40 PM