అర్హులందరికీ పాసు పుస్తకాలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:12 AM
అర్హలందరికీ ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తుందని ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వరి అన్నారు.
గోనెగండ్ల, జనవరి 2(ఆంధ్రజ్యోతి): అర్హలందరికీ ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తుందని ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వరి అన్నారు. వేముగోడు గ్రామంలో శుక్రవారం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని పలు గ్రామాలలో రైతులకు ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు పట్టాదారు పాసుపుస్తకాలను అందజే శారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ భూసర్వేలు జరిగిన గ్రామాలలో ని రైతులకు రాజముద్రతో ముద్రించిన పాసు పుస్తకాలను అందజేస్తున్నటు తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 9వ తేది వరకు కొనసాగుతుందని, అలాగే సర్వేజరగని గ్రామాలలో కూడా త్వరలో సర్వేలు చేసి పాసుపుస్తకాలను పంపిణీ చేస్తామని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది, రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.