ఆలయ నిర్మాణానికి విరాళం
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:54 PM
కోసిగిలోని 3వ వార్డు వాల్మీకినగర్‌లోని లక్ష్మీనరసింహస్వామి నూతన దేవాలయ నిర్మాణానికి టీడీపీ నాయకుడు, కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ముత్తురెడ్డి రూ.50 వేలు విరాళాన్ని ఆలయ కమిటీ పెద్దలు హంపయ్య, లక్ష్మన్న, బసయ్యకు అందజేశారు.
కోసిగి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కోసిగిలోని 3వ వార్డు వాల్మీకినగర్‌లోని లక్ష్మీనరసింహస్వామి నూతన దేవాలయ నిర్మాణానికి టీడీపీ నాయకుడు, కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ముత్తురెడ్డి రూ.50 వేలు విరాళాన్ని ఆలయ కమిటీ పెద్దలు హంపయ్య, లక్ష్మన్న, బసయ్యకు అందజేశారు. ముత్తురెడ్డి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కోసిగి గ్రామాభివృద్ధే తన ధ్యేయమని తెలిపారు. అనంతరం ముత్తురెడ్డికి వాల్మీకినగర్ కాలనీవాసులు పూలమాలలు, శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు హుశేనీ, ఈరయ్య, హనుమంతు, నరసన్న, రామాంజనేయులు, తదితరులు ఉన్నారు.