Share News

క్రమశిక్షణతో మెలగాలి

ABN , Publish Date - Dec 31 , 2025 | 10:56 PM

శిక్షణ నిమిత్తం కర్నూలు జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రానికి (డీటీసీ) విచ్చేసిన 205 మంది ఏపీఎస్‌పీ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో మెలగాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు.

క్రమశిక్షణతో మెలగాలి
మాట్లాడుఉతన్న ఎస్పీ విక్రాంత పాటిల్‌

ఎస్పీ విక్రాంత పాటిల్‌

ఫ ట్రైనీ కానిస్టేబుళ్లకు దిశా నిర్దేశం

కర్నూలు క్రైం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): శిక్షణ నిమిత్తం కర్నూలు జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రానికి (డీటీసీ) విచ్చేసిన 205 మంది ఏపీఎస్‌పీ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో మెలగాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు శిక్షణా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అమీలియో హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఏపీఎస్‌పీ ట్రైనీ పోలీసులకు ఉచిత మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. సమన్వయంతో, మానవతా దృక్పథంతో పని చేసి సమస్యలను పరిష్కరించే విదంగా శిక్షణ పొందాలన్నారు. 9 నెలల పాటు శిక్షణలో ఔట్‌డోర్‌, ఇండోర్‌ శిక్షణతో పాటు టెక్నాలజీ, కమ్యూనికేషన స్కిల్స్‌, ఆయుధాల వినియోగం పట్ల శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషినల్‌ ఎస్పీ అడ్మిన, డీటీసీ ప్రిన్సిపాల్‌ హుస్సేన పీరా, డీఎస్పీ బాబు ప్రసాద్‌, డీటీసీ డీఎస్పీ వైస్‌ ప్రిన్సిపల్‌ దుర్గాప్రసాద్‌, పోలీస్‌ వెల్ఫేర్‌ హాస్పిటల్‌ డా.స్రవంతి, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు ఇతర సిబ్బంది, అమీలియో హాస్పిటల్‌ వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 10:56 PM