Home » KTR
ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గులాబీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు.
బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీన ప్రతిపాదనను కేటీఆర్ తీసుకొచ్చారన్న సీఎం రమేష్.. ఈ సందర్భంగా కమ్మ సామాజిక వర్గంపైన కేటీఆర్ అసభ్య పదజాలాన్ని వాడారని చెప్పుకొచ్చారు..
సిగాచి పరిశ్రమ ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారంపై బీఆర్‌ఎస్ అగ్ర నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఎ ఫహీం ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌ను ఏదో పార్టీలోకి విలీనం చేయబోతున్నామంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్‌ఎస్ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితపై కేసులు ఎత్తేస్తే.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామంటూ ఎంపీ సీఎం రమేశ్ ఎదుట కేటీఆర్ చేసిన ప్రతిపాదన వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ మేరకు జూబ్లీహిల్స్ సీఐ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్ని కేసుల్లో హైదరాబాద్ సిటీ పోలీసులు దర్యాప్తు పారదర్శకంగా జరుపుతున్నారని స్పష్టం చేశారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జూబ్లీహిల్స్ సీఐ పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. మన ఖర్మ కాలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాడన్నారు. అటు ఇటు కానోడు పరిపాలిస్తే.. ఇలాగే ఉంటుందని చెప్పారు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సామాజిక న్యాయం పాటించిందని.. ఈసారి జరిగే ఎన్నికల్లో సామాజిక న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని, ఇక దానిని నడిపించడం అసాధ్యమన్నారు. ఇది ప్రజల సమస్యల కంటే కుటుంబం కోసమే పనిచేస్తోందని ఆరోపించారు.
పోలీసులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన దురుసు వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.