Share News

KTR: ఒక్క ఇటుక పేర్చలేని దద్దమ్మ సీఎం రేవంత్‌ రెడ్డి

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:49 AM

ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సర్కారు ముక్కు నేలకు రాయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

KTR: ఒక్క ఇటుక పేర్చలేని దద్దమ్మ సీఎం రేవంత్‌ రెడ్డి

  • టన్నెల్‌ తవ్వడమే చేతగాని సన్నాసులు కాళేశ్వరంపై విమర్శలా?

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విసుర్లు

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సర్కారు ముక్కు నేలకు రాయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. సరిగ్గా సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ నిర్మించే తెలివి లేని, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వడమే చేతగాని కాంగ్రెస్‌ సన్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టులపై విమర్శలు చేయడమా? అని ప్రశ్నించారు. మరోమారు కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోబోమని లెంపలేసుకోవాలన్నారు.


మహబూబ్‌ నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగుపై నిర్మించిన చెక్‌ డ్యామ్‌ 2నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మంగళవారం ఎక్స్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. నాసిరకం పనులతో రైతుల పొలాలు, మోటారు పైపులైన్లతోపాటు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కొట్టుకు పోయిందన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 04:49 AM