Share News

TG Minister Counter to KTR: కేటీఆర్‌కు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్..

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:27 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలన్నారు.

TG Minister Counter to KTR: కేటీఆర్‌కు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్..

హైదరాబాద్, ఆగస్టు 21: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలన్నారు. థర్డ్ గ్రేడ్ అంటే కేటీఆర్ చేసిన అవినీతినా..? ఆయన అహంకారమా? అనేది చెప్పాలన్నారు. థర్డ్ గ్రేడ్ అంటే తమ ముఖ్యమంత్రినా? ప్రభుత్వమా? అంటూ కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌‌ ది డర్టీ మైండ్ అని.. ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్‌కు ఇంట్లో పంచాయితీ తట్టుకోలేక డైవర్ట్ చేయడం కోసం పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. కేటీఆర్‌ను సొంత చెల్లినే వ్యతిరేకిస్తోందని.. దాంతో ఆయన మైండ్ కరాబైందని ఎద్దేవా చేశారామె. బీఆర్ఎస్-బీజేపీ రాజకీయం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. హెలికాప్టర్ వేసుకుని థర్డ్ ఫ్రంట్ అని తిరిగారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ దృష్టిలో ఫస్ట్ గ్రేడ్ అంటే ఏంటో? థర్డ్ గ్రేడ్ ఏంటో చెప్పాలన్నారు. కేటీఆర్ ముందు కవిత చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సమాధానం చెప్పాలని చురకలంటించారు మంత్రి సీతక్క.


కేటీఆర్‌పై పొన్నం ఫైర్..

ఇదే సమయంలో కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. కేటీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ బండారం సెప్టెంబర్ 9న బయట పడుతుందన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తానా ఉందో లేదో ఆ రోజు తేలిపోతుందని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు బిడ్డకు మద్దతుగా నిలబడతావా? లేదా? అని కేటీఆర్‌ను మంత్రి పొన్నం ప్రశ్నించారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం అని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ కృత్రిమ డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. యూరియా ఇచ్చేది రాష్ట్రమా? కేంద్రమా? కేటీఆర్ చెప్పాలన్నారు. యూరియా ఎవరిస్తారో వారికే మద్దతు అంటే అర్థం ఏంటి? అని కేటీఆర్‌ను మంత్రి పొన్నం ప్రశ్నించారు. బీఆర్ఎస్‌.. బీజేపీ అభ్యర్థికే మద్ధతు ఇస్తుందని కేటీఆర్‌ కామెంట్స్‌ను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తోందన్నారు.


Also Read:

ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను..

నార్త్ కొరియా రహస్య స్థావరం.. ఈ దేశాలకు ముప్పు..

శ్రీశైలంలో కుట్రలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 21 , 2025 | 03:27 PM