Share News

Krishna District: ప్రేమ పెళ్లి.. ప్రియుడికోసం కట్టుకున్న భర్తను..

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:10 PM

Krishna District: వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా వీరి కాపురం సాగేది. లక్ష్మణ్, పావని మధ్యలోకి సమీప బంధువు ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు.

Krishna District: ప్రేమ పెళ్లి.. ప్రియుడికోసం కట్టుకున్న భర్తను..
Krishna District

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. పెళ్లి తర్వాత ప్రేమలు హత్యలకు దారి తీస్తున్నాయి. ప్రియుళ్ల కోసం కట్టుకున్న భర్తలను చంపేస్తున్న మహిళలు ఎక్కువైపోయారు. నిత్యం ఎక్కడో చోట భర్త, భార్య చేతిలో చనిపోతున్నాడు. తాజాగా, ఓ భార్య 15 ఏళ్ల ప్రేమ, పెళ్లిని కాదని దారుణానికి ఒడిగట్టింది. కొత్త ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. క‌ృష్ణా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గన్నవరం మండలం వెంకట నరసింహపురానికి చెందిన లక్ష్మణ్, పావని ప్రేమించుకున్నారు. 15 ఏళ్ల క్రితం పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. తర్వాత అదే గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. పెళ్లైన కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా వీరి కాపురం సాగేది. లక్ష్మణ్, పావని మధ్యలోకి సమీప బంధువు ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు.


తర్వాతి నుంచి కాపురం నాశనం అయింది. ప్రదీప్‌కు పావనితో ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ భర్త లక్ష్మణ్‌కు తెలియకుండా గుట్టుగా కలుస్తూ ఉండేవారు. అయితే, పావనిపై భర్తకు అనుమానం వచ్చింది. ఆమెను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 13వ తేదీన లక్ష్మణ్ చనిపోయాడు. పావని హడావుడిగా అతడి అంత్యక్రియలు జరిపించింది. లక్ష్మణ్ తరపు బందువులకు ఆమెపై అనుమానం వచ్చింది.


వాళ్లు ఆరా తీయగా.. పావని అక్రమ సంబంధం బయటపడింది. వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పావనిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె నిజం ఒప్పుకుంది. ప్రియుడు ప్రదీప్‌తో కలిసి భర్తను హత్య చేసినట్లు పావని ఒప్పుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రదీప్‌ను కూడా అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

కేరళలోని స్కూలుకెళ్లిన బుల్లి ఏనుగు.. అడ్మిషన్ కోసం అంటూ నెటిజన్ల కామెంట్లు..

అమెరికాను భారత్‌ మునుపటిలా నమ్మదు.. ట్రంప్‌పై మండిపడ్డ ప్రముఖ ఆర్థికవేత్త

Updated Date - Aug 21 , 2025 | 03:27 PM