Cute Elephant: కేరళలోని స్కూలుకెళ్లిన బుల్లి ఏనుగు.. అడ్మిషన్ కోసం అంటూ నెటిజన్ల కామెంట్లు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 02:59 PM
కేరళలోని ఓ స్కూలు వద్ద ఓ బుల్లి ఏనుగు సందడి చేసింది. స్కూలు ఆవరణలో తిరిగి అక్కడున్న వారందరికీ ఆహ్లాదం పంచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.
కేరళ (Kerala)లోని ఓ స్కూలు (School) వద్ద ఓ బుల్లి ఏనుగు (Baby Elephant) సందడి చేసింది. స్కూలు ఆవరణలో తిరిగి అక్కడున్న వారందరికీ ఆహ్లాదం పంచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. కేరళ-కర్ణాటక సరిహద్దులోని పుల్పల్లి ప్రాంతానికి 14 కి.మీ దూరంలో ఉన్న చెకాడి గ్రామంలో ఈ ఘటన జరిగింది (Viral Video).
చెకాడి గ్రామం చుట్టూ అడవి ఉంటుంది. అడవి మధ్యలో ఆ గ్రామం ఉండడంతో ఏనుగులు అప్పుడప్పుడు గ్రామంలోకి వస్తుంటాయి. ఆ గ్రామంలోని పాఠశాలలో దాదాపు 115 మంది చదువుతుంటారు. వారికి అప్పుడప్పుడు ఏనుగుల గుంపు కనిపిస్తుందట. అయితే తాజాగా కేవలం ఒక్క పిల్ల ఏనుగు మాత్రమే స్కూలు దగ్గరకు వచ్చింది. ఆ పిల్ల ఏనుగు రావడంతో స్కూలులోని పిల్లలకు ఒకేసారి ఆనందం, ఆందోళన కూడా కలిగాయి. స్కూలు ఆవరణలో ఏనుగు పిల్ల సంచరించడం ఇదే మొదటిసారి అని ఉపాధ్యాయులు మీడియాకు తెలిపారు.
ఆ బుల్లి ఏనుగు పాఠశాల వరండాలో తిరుగుతూనే ఉంది. దీంతో ఉపాధ్యాయులు పిల్లలను వెంటనే తరగతి గదుల్లోకి తరలించి, ముందు జాగ్రత్త చర్యగా తలుపులకు తాళాలు వేశారు. దాదాపు గంట తర్వాత అటవీ అధికారులు వచ్చి ఆ ఏనుగు పిల్లను అడవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. ఆ బుల్లి ఏనుగు అడ్మిషన్ కోసం స్కూలు దగ్గరకు వచ్చినట్టుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
షాకింగ్ వీడియో.. కాలి కింద రోడ్డు ఎలా మాయమైందో చూడండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..