Man Falls Into Drain: షాకింగ్ వీడియో.. కాలి కింద రోడ్డు ఎలా మాయమైందో చూడండి..
ABN , Publish Date - Aug 20 , 2025 | 09:23 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలు, వరదల దాటికి రోడ్లన్నీ అతలాకుతలమవుతున్నాయి. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. నాసిరకం రోడ్లు కొట్టుకుపోతున్నాయి. చిన్న బరువును కూడా తట్టుకోలేక కుంగిపోతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఆ వర్షాలు, వరదల దాటికి రోడ్లన్నీ అతలాకుతలమవుతున్నాయి. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. నాసిరకం రోడ్లు కొట్టుకుపోతున్నాయి. చిన్న బరువును కూడా తట్టుకోలేక కుంగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra)లోని చంద్రపూర్‌లో జరిగిన ఓ ఘటన షాకింగ్‌గా మారింది. ఆ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Viral Video).
@IndiaObserverX అనే ఎక్స్ యూజర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. చంద్రపూర్‌లోని ఓ యువకుడి ఓ బేకరి బయట తన స్కూటీని పార్క్ చేసి ఓ బాక్స్ పట్టుకుని లోపలికి వెళ్తున్నాడు. ఆ సమయంలో డ్రైన్ పైన వేసిన కాంక్రీట్ కవర్ అకస్మాత్తుగా కుంగిపోయింది. దీంతో ఆ వ్యక్తి నేరుగా డ్రైన్‌లో పడిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వారు అతడిని కాపాడేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అదృష్టవశాత్తూ అతడికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఆ వీడియో ఓ షాప్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని వందల మంది ఆ వీడియోను వీక్షించారు. పాదచారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ముంబై, ఇతర చుట్టుపక్కల జిల్లాల్లో 200 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..