KTR Vs Kavitha : చెల్లెలు కవితకు మరోసారి షాక్ ఇచ్చిన అన్న కేటీఆర్
ABN , Publish Date - Aug 20 , 2025 | 08:44 PM
చెల్లెలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె అన్న, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో కవితకు పూర్తిగా చెక్..
హైదరాబాద్, ఆగస్టు 20 : చెల్లెలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె అన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో కవితకు పూర్తిగా చెక్ పెట్టారు కేటీఆర్. TBGKS గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియామకంతో ఇది రూఢీ అయింది. గత నెలలో కొప్పుల ఈశ్వర్‌ను కేటీఆర్ ఇంచార్జ్ హోదాలో నియమించిన సంగతి తెలిసిందే.
ఇవాళ తెలంగాణ భవన్‌లో TBGKS నేతలు సమవేశమయ్యారు. పూర్తిస్థాయిలో కొప్పుల ఈశ్వర్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. దీంతో కవిత వర్గం నేతలు మండిపడుతున్నారు. తమ నాయకురాలు రాష్ట్రంలో లేని సమయంలో బొగ్గు గని సంఘం నుంచి తప్పించారని విమర్శిస్తున్నారు. పదేళ్ళపాటు TBGKS గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, కవితకు మద్దతుగా TBGKS కి పలువురు రాజీనామా కూడా సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News