Home » Khammam
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ(NIA) నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఖండించారు. తాము బహిరంగ ఉద్యమాలు చేశామే తప్ప ఎక్కడా సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహించలేదని ఆయన అన్నారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల పేరుతో పేదలను దోచుకున్నారంటూ ఏడుగురిని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. భూములు ఇప్పిస్తామంటూ నిరుపేదలను లక్షల్లో మోసం చేశారంటూ బల్లి శ్రీనివాస్, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారిని అరెస్టు చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి సైబర్ నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణను సత్తుపల్లి సీఐ శ్రీహరి అరెస్టు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓసీ-2లో డంపర్ వాహనం టైరు పేలి ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రాలచంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముహూర్త సమయాన సీతమ్మను మనువాడారు రామయ్య. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుంది.
భక్తరామదాసును తానీషా నవాబు కారాగారంలో బంధించిన సమయంలో ఆలపించిన కొన్ని కీర్తనల్లో ఈ నగల ప్రసక్తి ఉండటం విశేషం.
ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సి పాలిటీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు ఇసుక డంప్‌ల మాదిరిగానే పదుల సంఖ్యలో మట్టిని కూడా డంప్ చేస్తున్నారు.
భద్రగిరిలో శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని 27న జరిగే సీతారాముల కల్యాణం, 28న జరిగే మహా పట్టాభిషేకం కార్యక్రమాలను ఎలాంటి లోటుపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పూర్తిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు.
రైతులకు పెట్టుబడిసాయంగా అందజేస్తున్న రైతుభరోసా సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఖాతాల్లో జమచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.