Share News

Khammam: నిద్రిస్తున్న తల్లీకూతుళ్లకు పాముకాటు

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:42 AM

నిద్రలో ఉన్న తల్లీకూతుళ్లను పాము కాటేయడంతో చిన్నారి మృతి చెందగా.. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Khammam: నిద్రిస్తున్న తల్లీకూతుళ్లకు పాముకాటు

  • చిన్నారి మృతి.. చికిత్స పొందుతున్న తల్లి

సత్తుపల్లిరూరల్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): నిద్రలో ఉన్న తల్లీకూతుళ్లను పాము కాటేయడంతో చిన్నారి మృతి చెందగా.. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడెంలో జరిగింది. గూడేనికి చెందిన గౌర గోపి, మౌనిక దంపతులు, వారి చిన్న కుమార్తె లోహిత (5)తో కలిసి బుధవారం ఇంట్లో నేలపై నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో చిన్నారితో పాటు తల్లిని కట్లపాము కాటు వేసింది. వారిద్దరిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. మౌనికకు ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Aug 29 , 2025 | 04:42 AM