Home » Kerala
కేరళం ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సంకేతాలేంటి. కాంగ్రెస్ తొడగొట్టి అంత భారీ విజయాన్ని ఎలా నమోదు చేసింది. కాంగ్రెస్ వ్యూహాలు ఎలా పనిచేశాయి.
కేరళంలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ఓటమిని చవిచూసినప్పటికీ ధర్మాదం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం మూడోసారి. అయితే గత రెండు పర్యాయాల్లో ఆయన సాధించిన ఆధిక్యం కంటే ఈసారి తగ్గింది.
కేరళం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరుకు మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల హామీలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం సాగించాయి.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. బెంగాల్‌తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
కేరళం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్తాజా చర్య అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. కౌంటింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ వివరాల్లో 'ముఖ్యమంత్రి' పదాన్ని తొలగించారు. ఆ ప్లేస్‌లో సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అని చేర్చారు.
కేరళలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు ముందువరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ రూమ్‌లు తెరవరాదని ఆదేశాలిచ్చింది.
కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది.
కేరళలోని సంప్రదాయ ఆలయ ఉత్సవాలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయాయి. రాష్ట్రంలో వేసవి ఉత్సవాల సందడి నెలకొన్న వేళ ఈ రోజు(శనివారం) చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర ఆందోళనల్ని కలిగిస్తున్నాయి.