Share News

కేరళంలో పార్టీ విస్తరణకు విజయ్ టీవీకే సన్నాహకాలు

ABN , Publish Date - May 17 , 2026 | 09:45 PM

తొలి ఎన్నికల్లోనే తమిళనాట తిరుగులేని అదరణతో అతిపెద్ద పార్టీగా నిలిచి అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే పొరుగున ఉన్న కేరళంలో రాజకీయ విస్తరణ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కేరళలోని విజయ్ అభిమానులు పలువురు పాలక్కాడ్‌లో ఆదివారంనాడు సమావేశమయ్యారు.

కేరళంలో పార్టీ విస్తరణకు విజయ్ టీవీకే సన్నాహకాలు
TVK Vijay

తిరువనంతపురం: తొలి ఎన్నికల్లోనే తమిళనాట తిరుగులేని అదరణతో అతిపెద్ద పార్టీగా నిలిచి అధికారంలోకి వచ్చిన విజయ్ (Vijay) సారథ్యంలోని టీవీకే (TVK) పొరుగున ఉన్న కేరళం (Kerala)లో రాజకీయ విస్తరణకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కేరళంలోని విజయ్ అభిమానులు పలువురు పాలక్కాడ్‌లో ఆదివారంనాడు సమావేశమయ్యారు. గత వారంలోనూ విజయ్ ఫ్యాన్స్ కొందరు కేరళంలో టీవీకే విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు వయనాడ్‌లో ప్రయత్నాలు ప్రారంభించారు.


టీవీకే అధ్యక్షుడు విజయ్ 2024లో పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన అభిమానులు కేరళలో పార్టీ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో పార్టీ అనూహ్యంగా 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలవడంతో ఆ ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి.


కేరళలో 'విజయ్ మక్కల్ ఇయక్కం' బ్యానర్‌ కింద ఆయనకు వేలాది మంది అభిమానులు ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం సందర్భంగా కేరళలోని పలు చోట్ల విజయ్ అభిమానులు సంబరాలు సైతం జరుపుకున్నారు.


కాగా, అదివారంనాడు పాలక్కాడులో జరిగిన సమావేశంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది యువతీయువకులే కావడం, పలువురు ఐటీ నిపుణులు సైతం ఉండటం విశేషం. 'మై టీవీకే' యాప్ ద్వారా ఇప్పటికే సభ్యత్వ నమోదు కూడా వీరు వేగంగా జరుపుతున్నట్టు చెబుతున్నారు. కేరళలో బూత్ లెవెల్ నుంచి పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని, తమిళనాడులో మార్పునకు శ్రీకారం చుట్టిన టీవీకేకు కేరళ ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. టీవీకే నాయకత్వం అన్ని జిల్లాల్లోనూ కార్యకలాపాలను సమన్వయం చేయడం వల్ల పార్టీ బలోపేతమవుతుందని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విశాల్ ఎక్స్ పోస్టు..

గోవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందే.. వాహనాన్ని అడ్డుకున్న బెంగాల్ ఎమ్మెల్యే

Updated Date - May 17 , 2026 | 09:49 PM