Share News

20 మందితో కొత్త క్యాబినెట్‌.. గవర్నర్‌కు లిస్ట్ అందజేసిన సతీశన్

ABN , Publish Date - May 17 , 2026 | 07:04 PM

కేరళలో యూడీఎఫ్ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌, మరో 20 మంది క్యాబినెట్ మంత్రులు మే 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను సతీశన్ ఆదివారంనాడు లోక్‌భవన్‌‌కు వెళ్లి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు సమర్పించారు.

20 మందితో కొత్త క్యాబినెట్‌.. గవర్నర్‌కు లిస్ట్ అందజేసిన సతీశన్
VD Satheeshan

తిరువనంతపురం: కేరళలో యూడీఎఫ్ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌, మరో 20 మంది క్యాబినెట్ మంత్రులు మే 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను సతీశన్ ఆదివారంనాడు లోక్‌భవన్‌‌కు వెళ్లి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు సమర్పించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది.


కొత్త మంత్రులు వీరే

సతీశన్ మంత్రివర్గంలో రమేష్ చెన్నితాల, కె.మురళీధరన్, కేపీసీసీ చీఫ్ సన్నీ జెసెఫ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు చోటు దక్కింది. కేరళ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ నేత తిరువాంచూర్ రాధాకృష్ణన్, డిప్యూటీ స్పీకర్‌గా షానిమోల్ ఉస్మాన్‌ను ఎంపిక చేశారు.

కేరళం కొత్త సీఎం ఎవరనే దానిపై మే 4వ తేదీ నుంచి సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. కేసీ వేణుగోపాల్, గత అసెంబ్లీలో కాంగ్రెస్ విపక్ష నేత వీడీ సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఎట్టకేలకు మే 14న సతీశన్‌ను సీఎల్‌పీ నేత, తదుపరి సీఎంగా ఏఐసీసీ ప్రకటించడంతో సస్పెన్స్‌కు తెరపడింది.


ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీని యూడీఎఫ్ సాధించింది. మొత్తం 140 స్థానాల్లో 102 స్థానాల్లో గెలిచింది. అధికార ఎల్‌డీఎఫ్ 35 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 3 సీట్లు దక్కించుకుంది.


ఇవి కూడా చదవండి..

మోదీ అప్పీల్‌తో అధికారుల విదేశీ పర్యటనలపై గోవా సర్కార్ నిషేధం

తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విశాల్ ఎక్స్ పోస్టు..

Updated Date - May 17 , 2026 | 08:01 PM