కేరళం కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం వద్ద ఉన్న శాఖలివే..
ABN , Publish Date - May 20 , 2026 | 05:44 PM
కేరళంలో కొత్తగా ఏర్పాటైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించింది. ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన, ఓడరేవుల వంటి ప్రధాన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.
తిరువనంతపురం: కేరళంలో కొత్తగా ఏర్పాటైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించింది. ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన, ఓడరేవుల వంటి ప్రధాన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేశ్ చెన్నితాలకు కీలకమైన హోంశాఖ, విజిలెన్స్ శాఖలతో పాటు మరో మూడు శాఖలను కేటాయించారు.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కు చెందిన పి.కె.కున్హాలికుట్టికి పరిశ్రమలు, సమాచార సాంకేతికత, వస్త్ర పరిశ్రమలు సహా ఏడు శాఖలను అప్పగించారు. కేరళం కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌కు విద్యుత్, పర్యావరణ శాఖలను కేటాయించగా.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె.మురళీధరన్‌కు ఆరోగ్య, దేవస్వం(Devaswoms) శాఖలను ఇచ్చారు. రోజి ఎం.జాన్‌కు ఉన్నత విద్యా శాఖను అప్పగించగా.. ఎ.పి.అనిల్ కుమార్‌కు ల్యాండ్, రెవెన్యూ శాఖలను అప్పగించారు. ఇక, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎమ్మెల్యే శిబు బేబీ జాన్‌కు అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి శాఖలను కేటాయించారు. అలాగే నీటిపారుదల, భూగర్భ జలాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గృహనిర్మాణ శాఖలను కేరళ కాంగ్రెస్ (జోసెఫ్) శాసనసభ్యుడు మోన్స్ జోసెఫ్‌కు అప్పగించారు.
ఈ నెల 18న కేరళం కొత్త ముఖ్యమంత్రిగా వి.డి.సతీశన్ ప్రమాణస్వీకారం చేయగా.. ఆయనితోపాటు మరో 20 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీ, అమిత్‌షాపై మళ్లీ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడిన బీజేపీ
మంత్రివర్గ విస్తరణకు విజయ్ రెడీ.. 15 మందికి చోటు