కేరళం క్యాబినెట్ కూర్పు ఇదే.. సీఎం పదవి సహా కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు
ABN , Publish Date - May 17 , 2026 | 05:22 PM
కేరళలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈనెల 18వ తేదీ సోమవారంనాడు ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతోంది.
తిరువనంతపురం: కేరళలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఈనెల 18వ తేదీ సోమవారంనాడు ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతోంది. క్యాబినెట్ కూర్పు కోసం చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. మంత్రి పదవులకు సంబంధించి భాగస్వామ్య పక్షాలు విస్తృత చర్చల అనంతరం ఒక అవగాహనకు వచ్చినట్టు యూడీఎఫ్ వర్గాలు ఆదివారంనాడు తెలిపాయి.
కేరళం కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవితో సహా కాంగ్రెస్‌కు 12 క్యాబినెట్ బెర్త్‌లు లభించనున్నాయి. యూడీఎఫ్ కీలక భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కు 5 మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్‌పీ), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (జాకోబ్), సీపీఎంలకు ఒక్కొక్క మంత్రి పదవి దక్కనున్నట్టు చెబుతున్నారు. అయితే అధికారికంగా మంత్రుల జాబితాను ప్రకటించాల్సి ఉంది.
ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుని ఎల్డీఎఫ్ పదేళ్ల పాలనకు ఉద్వాసన పలికింది. ఎల్‌డీఎఫ్ కేవలం 35 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 3 సీట్లలో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి..
వయనాడ్‌ను మరిచిపోండంటూ రాహుల్, ప్రియాంకపై పోస్టర్లు
యూపీలో బుల్డోజర్ యాక్షన్... 240 లాయర్ ఛాంబర్ల కూల్చివేత షురూ