కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్
ABN , Publish Date - May 18 , 2026 | 10:20 AM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం గవర్నర్ ఆయనతో ప్రమాణం స్వీకారం చేయించారు.
తిరువనంతపురం, మే 18: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
కాగా, మొత్తం 20 మందితో మంత్రివర్గం ఏర్పాటు అయింది. సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 20 మందిలో 14 మంది తొలిసారిగా బాధ్యతలు చేపట్టినవారే కావడం గమనార్హం. సామాజిక, ప్రాంతీయ, మిత్రపక్షాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రులను ఎంపిక చేసింది.
ఇవి కూడా చదవండి
ఓవర్ స్పీడ్‌గా వెళ్లొద్దన్న వృద్ధుడు.. యువకుల దారుణం
డచ్ ప్రధాని వ్యాఖ్యలను తోసిపుచ్చిన భారత్! అవగాహన లేదంటూ..