Share News

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్

ABN , Publish Date - May 18 , 2026 | 04:54 PM

కేరళం ముఖ్యమంత్రిగా సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన వీడి సతీశన్ తొలి క్యాబినెట్ సమావేశంలోనే కీలక సంక్షేమ, పాలనా సంబంధిత నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 15వ తేదీ నుంచి మహిళలకు కేఎస్ఆర్‌టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్
Kerala CM VD Satheesan

తిరువనంతపురం: కేరళం ముఖ్యమంత్రిగా సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన వీడి సతీశన్ (VD Satheesan) తొలి క్యాబినెట్ సమావేశంలోనే కీలక సంక్షేమ, పాలనా సంబంధిత నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 15వ తేదీ నుంచి మహిళలకు కేఎస్ఆర్‌టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగాలు చేసే మహిళలు, విద్యార్థినులు, రోజువారీ ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నట్టు కూడా ప్రకటించారు. వృద్ధతరం పెరుగుతుండటం, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సీనియర్ సిటిజన్ల హెల్త్‌కేర్, సామాజిక భద్రత, పునరావాసం, సంక్షేమ పథకాలను ఈ ప్రత్యేక శాఖ సమన్వయం చేస్తుందని చెప్పారు.


ఆశా వర్కర్లకు రూ.3,000 గౌరవ వేతనం

ఆశావర్కర్ల గౌరవ వేతనాన్ని రూ.3,000కు పెంచుతున్నట్టు కూడా ముఖ్యమంత్రి సతీశన్ ప్రకటించారు. కేరళం హెల్త్‌కేర్ సిస్టంలో ఆశా వర్కర్లు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వర్కర్లు, హెల్పర్లకు రూ.1,000 చొప్పున వేతనం పెంచుతున్నామని, పాఠశాలల్లో వంటపనులు చేస్తున్న వారు, సహాయక సిబ్బంది, ప్రీ-ప్రైమరీ టీచర్లకు అదనంగా రూ.1,000 వేతనం పెంచుతున్నామని చెప్పారు.


దాడులపై సిట్

2023 నవ కేరళం యాత్ర సందర్భంగా యువజన కాంగ్రెస్ నేతలపై జరిగిన దాడులపై ప్రత్యేక విచారణ బృందం (SIT) ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం సతీశన్ ప్రకటించారు. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధించేందుకు, జవాబుదారీతనాన్ని పాదుకొలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని, రుణాలు, వ్యయం, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పారదర్శకతకు కట్టుబడి ఉంటామని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

6 నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలుతుంది.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Updated Date - May 18 , 2026 | 05:16 PM