Share News

6 నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలుతుంది.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - May 18 , 2026 | 01:30 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే ప్రభుత్వంపై డీఎంకే పార్టీ సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీవీకే ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ అధికారంలో ఉండదని అన్నారు.

6 నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలుతుంది.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
Vijay TVK government

చెన్నై, మే 18: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే ప్రభుత్వంపై డీఎంకే పార్టీ సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీవీకే ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ అధికారంలో ఉండదని అన్నారు. మళ్లీ డీఎంకే పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఆదివారం దక్షిణ తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇంకో నాలుగు నెలలు మాత్రమే టీవీకే ప్రభుత్వం ఉంటుంది. అధవ్ అర్జున అనే వ్యక్తికి ధైర్యం ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’..


‘నేను కూడా రాజీనామా చేస్తా. ఇద్దరం తిరుచెందూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం. ఇది మా పట్టణం. ఎవరినైనా ఓడిస్తాం. మా బాస్ ఎంకే స్టాలిన్ తిరుచ్చి నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నా. స్టాలిన్ కొలతూర్‌ను సింగపూర్‌లా మార్చారు. నాలుగు నెలలు లేదా ఆరు నెలల తర్వాత మళ్లీ బాస్ ముఖ్యమంత్రి అవుతారు’ అని అన్నారు. టీవీకే, డీఎంకే పార్టీల మధ్య రాజకీయ పోరు ఊపందుకున్న ఈ సమయంలో అనిత రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీవీకే పార్టీ కానీ, అధవ్ అర్జున కానీ స్పందించ లేదు.


ట్రెండ్ సెట్ చేస్తున్న విజయ్..

విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాత సంప్రదాయానికి గుడ్‌బై చెప్పారు. అచ్చం ఒక ప్రభుత్వ అధికారి తరహాలో వ్యవహరిస్తున్నారు. విజయ్‌ అంతకుముందు వరకు తెల్లచొక్కా, కలర్‌ప్యాంటుతో కనిపించేవారు. ప్రమాణ స్వీకారం నుంచి డ్రెస్‌ మార్చేశారు. వైట్‌షర్ట్‌పై బ్లాక్‌ బ్లేజర్‌, బ్లాక్‌ ప్యాంటు ధరిస్తున్నారు. ఆఫీస్‌ టైమ్‌కు పావుగంట ముందే ఆఫీస్‌కు వస్తున్నారు. తన చాంబర్‌లోనే మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. మళ్లీ విధులకు హాజరవుతున్నారు.


ఇవి కూడా చదవండి

పుట్టగొడుగులు కడిగే ముందు ఇది తెలుసుకోండి

ట్విష శర్మ ఆత్మహత్య.. వెలుగులోకి చివరి మెసేజ్‌లు..

Updated Date - May 18 , 2026 | 01:58 PM