Share News

పుట్టగొడుగులు కడిగే ముందు ఇది తెలుసుకోండి

ABN , Publish Date - May 18 , 2026 | 01:05 PM

పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ, వాటిని శుభ్రం చేసే విధానం కూడా చాలా ముఖ్యం. తప్పుగా కడిగితే వాటి రుచి, గుణాలు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే పుట్టగొడుగులను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోవాలి.

పుట్టగొడుగులు కడిగే ముందు ఇది తెలుసుకోండి
Mushroom Cleaning Tips

ఇంటర్నెట్ డెస్క్: పుట్టగొడుగులతో చాలా మంది పిజ్జా, పాస్తా, కర్రీలు, సూప్‌లు వంటి వంటకాలు తయారు చేస్తుంటారు. ఇవి రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచివి. అయితే పుట్టగొడుగులను శుభ్రం చేసే సమయంలో చాలామంది చేసే కొన్ని తప్పులు వాటి రుచి, గుణాలను తగ్గిస్తాయి.


మార్కెట్‌లో కొనుగోలు చేసిన పుట్టగొడుగులపై మట్టి లేదా నల్లటి మచ్చలు ఉండటం సాధారణం. అందుకే చాలామంది వాటిని నేరుగా నీటిలో బాగా కడుగుతారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. పుట్టగొడుగులు స్పాంజిలా నీటిని త్వరగా పీల్చుకుంటాయి. దీంతో అవి వండిన తర్వాత రుచి తగ్గిపోవచ్చు. కాబట్టి, పుట్టగొడుగులను శుభ్రం చేసే సమయంలో కొన్ని సులభమైన చిట్కాలు పాటించడం మంచిది.

గోధుమ పిండి ఉపయోగించండి

పుట్టగొడుగులను ఒక గిన్నెలో వేసి కొద్దిగా గోధుమ పిండి చల్లాలి. తర్వాత మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే మట్టి, మురికి సులభంగా తొలగిపోతాయి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో త్వరగా కడిగి, వెంటనే పొడి గుడ్డతో తుడవాలి.


తడి గుడ్డతో తుడవండి

పుట్టగొడుగులు ఎక్కువ మురికిగా లేకపోతే తడి గుడ్డతో తుడవడం సరిపోతుంది. ఇలా చేయడం వల్ల నీటిలో నానబెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే వాటి సహజ రుచి కూడా అలాగే ఉంటుంది.

గోరువెచ్చని ఉప్పు నీరు

పుట్టగొడుగులు చాలా మురికిగా ఉంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి, అందులో 20 నుంచి 30 సెకన్లు మాత్రమే ఉంచాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదు. తర్వాత వెంటనే తీసి పొడి గుడ్డతో తుడవాలి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • పుట్టగొడుగులను ఎక్కువసేపు నీటిలో నానబెట్టకూడదు.

  • కడిగిన వెంటనే తుడిచి ఆరబెట్టాలి.

  • ఫ్రిజ్‌లో పెట్టాలంటే పూర్తిగా తుడిచి నిల్వ చేయాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి

రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు

Updated Date - May 18 , 2026 | 01:05 PM