వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి
ABN , Publish Date - May 18 , 2026 | 03:47 PM
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై ఆగంతకులు రాళ్లురువ్విన ఘటన బీహార్‌లోని ముజఫ్పర్‌పుర్ లో సోమవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలు కోచ్‌లకు చెందిన కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
పాట్నా: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)పై ఆగంతకులు రాళ్లురువ్విన ఘటన బీహార్‌లోని ముజఫ్పర్‌పుర్ (Muzaffarpur)లో సోమవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలు కోచ్‌లకు చెందిన కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
మజ్‌హౌలియా-ఖాబ్రా ప్రాంత సమీపంలో పాటలీపుత్ర-గోరఖ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (26501)పై ఈ రాళ్లదాడి జరిగింది. మూడు కోచ్‌లకు చెందిన కిటికీ అద్దాలు దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. దీనిపై ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులు, రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (RPF)కు సమాచారం ఇచ్చారు.
మరో రెండు రైళ్లపైనా..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగిన కొద్ది సేపటికే అదే రైల్ సెక్షన్‌పై మరో రెండు రన్నింగ్ ట్రైన్స్‌పై రాళ్ల దాడి జరిగింది. పాట్నా-జైనగర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (15550), లిచ్ఛవి ఎక్స్‌ప్రెస్ (14006)ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో రెండు రైళ్లలోని పలు బోగీల కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి.
ప్యాసింజర్ రైలులో మంటలు
కాగా, బీహార్‌లోని ససారం రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ససారం నుంచి పాట్నాకు వెళ్లాల్సిన ఈ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఒక కోచ్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అయితే మంటలను వెంటనే అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.
ఇవి కూడా చదవండి..
రైలులో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు
గోమతి నగర్ రైలులో దారుణం ఘటన.. యువతిని ముక్కలుగా నరికి పెట్టెలో..