Home » Karnataka
అడవిపందిని వేటాడబోయి ఓ వేటగాడు దుర్మరణం పాలయ్యాడు. రామనగర జిల్లా మాగడి అటవీప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లిన సమయంలో నాటు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో వేటగాడు పాండురంగా దుర్మరణం చెందాడు. స్నేహితుడు కిరణ్‌తో కలసి నాటుతుపాకీతో వేటకు వెళ్లారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. సన్న పామప్ప అలియాస్ పామన్న నేరం చేసినట్లు రుజువు కావడంతో రాయచూరు జిల్లా మూడో అదనపు ఫాస్ట్‌ట్రాక్ న్యాయాధికారి బీబీ జకాతి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.
ఓ రేడియాలజిస్టు తన పాడు బుద్ధి చూపించాడు. స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చిన మహిళపై అఘాయిత్యం చేశాడు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఓ కీలక పదవి వరించే అవకాశాలున్నాయనే వార్తలను పార్టీ వర్గాలు వెల్లడిస్తుండగా.. ఆ పదవి ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
సత్యసాయి గ్రామంలో జరుగుతున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫెస్టివల్ కార్యక్రమానికి ఫిజీ అధ్యక్షుడు హాజరయ్యారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని 100 దేశాలు ఒక్కతాటిపైకి రావడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సేవ, మానవత్వం, ఐక్యతకు ఇది నిదర్శనమని అన్నారు.
మంజునాథ్ జాంబీలా కనిపించటం కోసం చాలా సర్జరీలు చేయించుకున్నాడు. నాలుకను సైతం రెండుగా కోయించుకున్నాడు. చెవులను కత్తిరించుకున్నాడు. తలకు కొమ్ములు కూడా తగిలించుకున్నాడు.
ఉత్తరకర్ణాటక సమస్యలపై సమగ్ర చర్చలు జరగాలనే కారణంతో ఏటా బెళగావి సువర్ణసౌధలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుపుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అందుకే ప్రభుత్వం నుంచి ఏవిధమైన జీతభత్యాలు స్వీకరించేది లేదని జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర్ పేర్కొన్నారు.
తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐసీసీ కమిటీ చైర్మన్ మంత్రి శివరాజ్ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఎన్నో శ్రమలు, ఒడిదుడుకులు సహించి ఆఫీసు పనిలో నెగ్గుకొస్తోంది నేటి మహిళామణి. తన స్వప్నాన్ని, సమయాన్ని కాపాడుకుంటూ ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ వర్కింగ్ ఉమెన్ ముందుకు సాగుతున్నారు.. అలాంటి వీళ్లకి ఇప్పుడొక గుడ్ న్యూస్..
తుంగభద్ర డ్యామ్‌కు పోలీసులు పటిష్ట భద్రతను కల్పిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేగాక... పలు ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. సాయుధ పోలీసు బలగాలు ప్రాజెక్టు పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.