Lakkundi Gold Discovery: అరకేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్.. ఇది అస్సలు ఊహించలేదు
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:05 AM
శనివారం ఉదయం ప్రజ్వల్ అనే బాలుడు తమ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతూ ఉన్నాడు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల ప్రాంతంలో అతడికి భూమిలో చిన్న రాగి బిందె దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో పెద్ద మొత్తంలో పురాతన బంగారు ఆభరణాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: లక్కుండి అరకేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా రాగి బిందెలో అరకేజీ బంగారం దొరికిన సంగతి తెలిసిందే. అది నిధి అని భావించిన కుటుంబసభ్యులు జిల్లా అధికారులకు అప్పగించారు. నిన్న(ఆదివారం) పురావస్తు శాఖకు చెందిన అధికారులు నిధి దొరికిన చోటుకు వచ్చారు. ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యుల పంట పండించే మాట చెప్పారు. ఆ ఇంటి ఆవరణలో దొరికినది నిధి కాదని, ఆ ఇంటి పూర్వీకులు దాచిన బంగారం అని తేల్చి చెప్పారు. ఆ బంగారం పురాతన నిధి కిందకు రాదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్థులు, బంగారం దొరికిన ఇంటి వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు.
తమ బంగారం తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిధి దొరికిన తర్వాత కుటుంబసభ్యులు దాన్ని జిల్లా అధికారులకు మనస్ఫూర్తిగా అప్పగించారు. బంగారం తిరిగి ఇవ్వడానికి ఎలాంటి పేచీ పెట్టలేదు. ఆ బంగారం వారి పూర్వీకులది అని తేలటంతో వారు దాన్ని తిరిగి అడుగుతున్నారు. గ్రామస్థులు కూడా బంగారాన్ని కుటుంబసభ్యులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారుల స్టేట్‌మెంట్ నేపథ్యంలో జిల్లా అధికారులు ఆ బంగారాన్ని కుటుంబసభ్యులకు తిరిగి ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులూ ఎంతో ఆసక్తిగా నిధి వెనక్కు వస్తుందా? లేదా అని ఎదురుచూస్తూ ఉన్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
గదగ్ జిల్లాలోని చారిత్రాత్మక గ్రామం లక్కుండికి చెందిన ప్రజ్వల్ రిట్టి 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం అతడు తమ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతూ ఉండగా.. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల ప్రాంతంలో అతడికి భూమిలో చిన్న రాగి బిందె దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో పెద్ద మొత్తంలో పురాతన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెంటనే అతడు గ్రామ అధికారులకు సమాచారం అందించాడు. కొద్దిసేపటి తర్వాత గ్రామ అధికారులతో పాటు మండల, జిల్లా అధికారులు కూడా అక్కడికి వచ్చారు. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్రంలో అల్మాంట్ కిడ్ సిరప్ లేదు
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..