Share News

AP Drug Control Board: రాష్ట్రంలో అల్మాంట్‌ కిడ్‌ సిరప్‌ లేదు

ABN , Publish Date - Jan 12 , 2026 | 06:57 AM

చిన్నారుల్లో జలుబు తగ్గించేందుకు ఉపయోగించే ‘అల్మాంట్‌ - కిడ్‌’ సిరప్‌ రాష్ట్రానికి సరఫరా జరగలేదని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి తెలిపింది.

AP Drug Control Board: రాష్ట్రంలో అల్మాంట్‌ కిడ్‌ సిరప్‌ లేదు

  • ఔషధ నియంత్రణ మండలి అధికారుల వెల్లడి

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): చిన్నారుల్లో జలుబు తగ్గించేందుకు ఉపయోగించే ‘అల్మాంట్‌ - కిడ్‌’ సిరప్‌ రాష్ట్రానికి సరఫరా జరగలేదని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. బిహార్‌కు చెందిన ట్రిడస్‌ రెమెడీస్‌ సంస్థ తయారు చేసి ఏఎల్‌-24002 బ్యాచ్‌ సిర్‌పలో మోతాదుకు మించి ఇథలీన్‌ గ్లైకాల్‌ ఉన్నట్లు కోల్‌కతాలోని ల్యాబ్లో పరీక్షించగా తేలినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హోల్‌సేల్‌, రిటైర్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించామని ఆదివారం వెల్లడించింది. ప్రైవేటు మందుల దుకాణాల్లో వీటి విక్రయాలు జరగడం లేదని, అసలు దిగుమతి కాలేదని ప్రాథమికంగా తేలినట్టు పేర్కొంది. ఇలాంటి డ్రగ్‌ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్‌ ఆదేశించారు. ఈ సిరప్‌ వాడకాన్ని ఇప్పటికే తెలంగాణలో నిలిపివేశారు.

Updated Date - Jan 12 , 2026 | 06:58 AM