Home » Karimnagar
యూరియా కోసం రైతులకు కొత్త కష్టాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేపట్టగా ఇటీవల దాన్ని మూసివేసి కేంద్ర ప్రభుత్వం ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్‌ను అందు బాటులోకి తీసుకొచ్చారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) తిరిగి చెల్లించే విషయంలో కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో రైస్ మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలు, శాంతి, సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు. పెద్దపల్లిలోని డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఖాన్‌సాయి పేట, వెంకటాపూర్, మల్లారం, స్వర్ణపల్లి భట్టుపల్లి, ప్రాథమిక పాఠశాలలతోపాటు ఆరెంద జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను బుధవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు.
ప్రజా కవి కాళోజీ తన రచనల ద్వారా ప్రజల పక్షాన నిలిచారని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు.
పర్యావరణ పరి రక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు మట్టి గణపతిని పూజించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరిం చారు.
ఆకాశాన్నంటిన ఉల్లిగడ్డ ధరలు సామాన్యుడికి గుండెకోత మిగులుస్తున్నాయి. మొన్నటివరకు కిలో ముప్పై, నలభై రూపాయల మధ్య ఉన్న ఉల్లిగడ్డ, ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి 80 వరకు పలుకుతూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలని మంగళవారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు తాళ్లపల్లి యుగంధర్ ఆధ్వర్యంలో డప్పులతో ర్యాలీ నిర్వహించారు.
కాం గ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుం డా ప్రజలను మోసంచేసిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు. హామీల అమలు వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేం దుకు నిర్వహించిన పోరుబాట విజయవంతంగా ముగిసిందన్నారు.
గణేష్ వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని, 25న నిర్వహించే గణేష్ నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు.