Home » Karimnagar
ఆది దేవుడు.. లంభోదరుడు.. గణపయ్య.. గణేషుడు... ఇలా అనేక పేర్లు తీరొక్క రూపాలతో భక్తకోటికి ఎదురయ్యే విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది.
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో గ్యాస్ వినియోగంపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. దీంతో ఇప్పటివరకు 45 రోజుల వ్యవధి ముగిసే వరకు ఎదురు చూడాల్సిన వినియోగదారులకు ఇక 25 రోజులకే మరో సిలిండర్ బుక్ చేసుకునే వెసలుబాటు కలిగింది.
ప్రభుత్వ పథకాలు గడప గడపకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం 47వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మేయర్ ప్రజలకు వివరించారు.
సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసినందున జేబీసీసీఐ కార్మిక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి వెడ్డపల్లి కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం ప్రెస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని సోమవారం గణేష్ విగ్రహ ప్రతిష్టాపన, 23న బుధవారం నిమజ్జనం జరుపుకోవాలని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వొజ్జల వెంకటేశ్వర్లు, గోవర్ధనగిరి శశిధర్, ఉత్సవ సమితి అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాస్, కార్యదర్శి రావుల శ్రీనివాస్, వీహెచ్‌పీ విభాగ్ అయోధ్య రవీందర్ సూచించారు.
పర్యావరణ పరిరక్ష ణకు మట్టి గణపతిని పూజిద్దామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం పట్టణలో మున్సిపల్ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గ ప్రజలందరికి మట్టి వినాయక విగ్రహాలను అందించి, వినాయక చవితి శుభాకాంక్షలు తెలి పారు.
పెద్దప ల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మార్చి నాటికి పనులు పూర్తిచేసి, ఆసుపత్రి ప్రారంభం నాటికే అన్ని వైద్య పరికరాలు, విద్యుత్, నీరు తదితర మౌలిక వసతులను సిద్ధం చేయాలని సూచించారు.
ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతన సవరణ ఒప్పందం గడువు ముగిసినందున తక్షణమే వేతనాలు, అలవెన్సులు పెంచాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
డ్రగ్స్ మహమ్మారి, సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్ సూచించారు. బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
పాలతో తయారు చేయాల్సిన స్వీట్లను అసలు పాలు లేకుండా తయారు చేస్తున్న ఓ స్వీటు షాపు బండారం బయటపడింది.