• Home » Karimnagar

Karimnagar

రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రతో పార్టీకి పూర్వవైభవం

రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రతో పార్టీకి పూర్వవైభవం

రాహుల్‌గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన జోడో యాత్రతో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం రానున్నదని ఏఐసీసీ పరిశీలకులు, తమిళనాడు మాజీ ఎంపీ జై కుమార్‌ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో, జిల్లాలో బలోపేతం చేయడానికి ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ డ్రామాలు

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ డ్రామాలు

ఆరు గ్యారంటీల తరహాలోనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతూ తెలంగాణ బీసీ బిడ్డలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ అన్నారు. గురువారం హైదరాబాదు తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్‌, నేడు నమ్మించి మోసం చేసిందన్నారు.

నేషనల్‌ హైవే భూ సేకరణ సమస్యలను పరిష్కరించాలి

నేషనల్‌ హైవే భూ సేకరణ సమస్యలను పరిష్కరించాలి

నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులకు సంబంధించి భూ సేకరణ సమస్యలను ఈనెల 24లోపు పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆర్డీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో పలు అభివృద్ధి పనుల పై వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు.

జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు

జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు

జిల్లా ఆస్పత్రిలో 24 గంటలు మెరుగైన వైద్యసే వలు అందుతున్నాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. గురువారం జిల్లా ఆస్పత్రిని సందర్శించి నూతనంగా నిర్మిస్తు న్న ఆస్పత్రి భవన పనులను పరిశీలించిన అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలి సారిగా రోజు ఒక్కో రకం రంగు బెడ్‌ షీట్‌ లను వినియోగించడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రా రంభిస్తున్నట్టు తెలిపారు.

Karimnagar Police Assault: కూలీపై పోలీసుల లాఠీ దాడి.. ఏం జరిగిందంటే

Karimnagar Police Assault: కూలీపై పోలీసుల లాఠీ దాడి.. ఏం జరిగిందంటే

తాగిన మత్తులో బస్టాండ్‌ ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు పరుశురాంను అడ్డుకున్నారు. బస్టాండ్ ఆవరణలో మూత్రవిసర్జన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Diwali Special Trains: దీపావళి, చాట్‌ పండుగలకు చర్లపల్లి-అనకాపలి ప్రత్యేక రైళ్లు

Diwali Special Trains: దీపావళి, చాట్‌ పండుగలకు చర్లపల్లి-అనకాపలి ప్రత్యేక రైళ్లు

దీపావళి, చాట్‌ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

నిష్పక్షపాతంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేస్తాం

నిష్పక్షపాతంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేస్తాం

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడి నియామకాన్ని నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్‌ స్పష్టం చేశారు. శివకిరణ్‌ గార్డెన్స్‌లో మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎంపికలో భాగంగా నిర్వహించిన సంఘటన్‌ శ్రీజాన్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్‌ మాట్లాడుతూ జిల్లాలోని మంథని, రామగుండం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల అందరితో సమాలోచనలు చేసిన అనంతరం సమర్థవంతమైన నాయకుడిని అందరి ఆమోదం మేరకు ఎంపిక చేస్తామని వెల్లడించారు.

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలు

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలు

జాప్యం లేకుండా కోల్‌మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ సేవలను ఉద్యోగులకు అందించేందుకు కృషి చేస్తున్నామని కమిషనర్‌ హరి పచౌరి అన్నారు. మంగళవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగులకు రివైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌లను ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావుకు అందజేశారు.

పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు

పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార దుర్వినియోగం పెరిగిందని, చిన్న స్థాయి కాంగ్రెస్‌ నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు పోలీసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు పేర్కొన్నారు.

వైద్య సిబ్బంది వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలి

వైద్య సిబ్బంది వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలి

వివిధ వ్యాధులతో చికిత్స కోసం వచ్చే పేషంట్ల ద్వారా కొన్ని వ్యాధులు వైద్య ఆరోగ్య సిబ్బందికి సంక్రమించే ప్రమాదం ఉందని, ఇందుకు సిబ్బంది వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి