Home » Karimnagar
విద్యార్థులు సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి చూపాలని, ఆధునిక కాలంలో సైన్స్‌పై అవగాహన పెంచుకొని పరిశోధ నల వైపు దృష్టి సారించాలని జిల్లా పరిషత్ సీఈఓ నరేందర్ పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీపీసీ టీటీసీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారం భించారు.
సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తతతో నేరాలను అరికట్టాలని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం కమిషరేట్ కార్యాల యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యం లో ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ అనే కార్యక్రమంలో భాగంగా ఆరు వారాల సైబర్ భద్రత ప్రచార కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.
రామగుం డం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిం చారు.
ఎయిడ్స్‌పై ప్రజల్లో విద్యార్థులు సరైన అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం, సిరి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, ఇన్స్పైర్ అవార్డ్ మనాక్ జంట ఎగ్జిబిషన్లు ఎన్టీపీసీ ఉన్నత పాఠశాలలో ఈనెల 2, 3, 4 తేదీల్లో జరగనున్నాయి. సోమవా రం జిల్లా విద్యాధికారి శారద ఏర్పాట్లను పరిశీలించారు.
పాఠశాలల్లో విద్యా ర్థులను నాలుగు హౌజ్‌ల కింద విభజిస్తే వారికి మేలు జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, గ్రంథాలయం సందర్శించారు.
సింగరేణి కార్మిక సం ఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఎస్‌యూఎస్, ఏఐ ఎఫ్‌టీయూ, టీఎన్టీయూసీ, ఎస్జీ కేఎస్, ఐఎఫ్టీయూ ఏడు కార్మిక సంఘాల సమావేశం ఆదివారం హెచ్ఎంఎస్ కార్యాలయంలో యూ నియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగింది.
జిల్లాలో నేటి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు వ్యాపారులకు లైసెన్స్‌లు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 75మద్యం షాపులు ప్రారంభించను న్నారు. రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సి పాలిటీలు, వివిధ మండలాల్లో కొత్త షాపులు ఏర్పాటు కానున్నాయి.
రామగుండంలో ఎన్ని శక్తులు అడ్డుపడ్డా ప్రజల అభిష్టం మేరకు విద్యుత్ కేంద్రం కట్టి తీరుతామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రామగుండంలో 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం రామగుండం పట్టణానికి వచ్చిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
పంచాయతీ ఎన్నికలు పారదర్శ కంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, డి వేణులతో కలిసి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.