Home » Karimnagar
మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పండుగను పురస్కరించుకుని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో సీపీ రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మద్య తరగతి కుటుం బాల విద్యార్థులు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉం డకూడదనే మంథనిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో ఆదివారం హలో స్వేరో చలో గంగాధర పోస్టర్‌ను స్వేరో ప్రతిని ధులు ఆవిష్కరించారు. ఈ నెల 30న జరగనున్న జ్ఞాన సమ్మేళనంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని దాసరి ఉష కోరారు.
పోలీసులు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్‌ఐ చంద్ర కుమార్ అన్నారు. ఆదివారం సుల్తానాబాద్‌లో నిర్వహిం చిన 10 కే రన్ కార్యక్రమాన్ని ఎస్‌ఐ చంద్రకుమార్ పోలీసు సిబ్బందితో కలిసి ప్రారం భించారు.
ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృషి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గోదా వరిఖని ఆర్‌టీసీ డిపో సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో జానపద కళోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామిని నెరవేర్చలేదని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ఎస్ వీరయ్య ఆరోపించారు.
మూడు నెలలకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న రేషన పంపిణీలో కార్డుదారులకు అవస్థలు ఎదురవుతున్నాయి. నిధానంగా తీసుకుందామని ఇన్నాళ్లు జాప్యం చేసిన కార్డుదారులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓ వైపు నెలాఖరు నిర్ణీత గడువు ముగిసే సమయం సమీపిస్తుండడం.. మరోవైపు దుకాణాల్లో బియ్యం లేవని డీలర్లు చెబుతుండడంతో లబ్ధిదారులకు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నిర్వాహకులు రిఫరల్ డాక్టర్లకు కమీషన్లు ముట్టజెబుతూ అందినంత దోచేస్తున్నారు. అర్హత లేని వారితో సెంటర్లను నిర్వహిస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.
పెళ్లి వేడుక ప్రతి కుటుంబంలో అతి ముఖ్యమైన సంబరం. పెళ్లంటే నూరేళ్ల పంటగా భావిస్తారు. కల్యాణం కమనీయంగా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పెళ్లి తంతు కోసం దూరతీరాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు తరలివస్తారు. ఇప్పుడు పెళ్లిళ్ల ముహూర్తాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసం ముహుర్తాలకు నెలవు. కానీ వధువు ఎక్కడ..? అనే పరిస్థితుల్లో అబ్బాయిలు ఆరాట పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థుల డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడానికి, రోజు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం మంథనిలో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేస్తోంది.