Home » Karimnagar
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పదో తరగతి చదివే విద్యార్థుల వార్షిక పరీక్షల్లో ఏ విధంగా సన్నద్ధం కావాలనేది టీజీఎస్‌ఈఆర్టీ ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌టీపీసీకి, రామగుండం నగరపాలక సంస్థకు మధ్య ఏడాదిన్నరగా నిర్మాణాలకు సంబంధించిన పంచాయితీ కొనసాగుతోంది. నవరత్న కంపెనీ అయిన ఎన్‌టీపీసీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండానే టౌన్‌షిప్‌లో నిర్మాణాలు చేయ డం వివాదస్పదమైంది.
ఎన్టీపీసీ సంస్థ అభివృద్ధిలో వెండర్ల పాత్ర కీలకమని రామగుండం ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత అన్నారు. శనివారం ఎన్‌టీపీసీ మీలినియం హాల్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ మహిళా వెండర్ డెవలప్‌మెంట్ మీటింగ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
జిల్లా కేంద్రంలోని స్థానిక ఐటీఐలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మై భారత్, యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ శనివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా ఎస్‌ఐ నరేష్ పాల్గొని మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారవద్దని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖలో వినియోగించని బ్యాంకు ఖాతాలలో నిధులు ఉంటే వాటిని సరి చేసుకోవాలన్నారు.
దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల్లో జాతి ఐక్యత, సామరస్యం, దేశ భక్తి, సమైక్యత భావంపై అవగాహన కల్పించడానికే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శుక్రవారం సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు(రన్ ఫర్ యూనిటీ)ను నిర్వహించారు.
భూ భారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం తహసిల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తులతోపాటు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు.
మొంథా తుఫాను ధాటికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నష్టం అంచనా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేగడిమద్దికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అధ్యక్షుడితోపాటు సీనియర్ నాయకులు మీస అర్జున్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించారు.
దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించడానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని కలె క్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, అరుణ శ్రీలతో కలిసి సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన చేసి నివాళు లర్పించారు.