Home » Karimnagar
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో దారి మైసమ్మల గుళ్లను కూల్చి వేయడంపై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఖని చౌరస్తాలోని పోచమ్మ గుడి వద్ద సమావేశమై చర్చించారు.
ప్రభు త్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలి పారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్యారోగ్యశాఖ పని తీరుపై సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నెలలో 263 ప్రసవాలు జరిగాయని, ప్రసవాల సంఖ్య పెరగడంపై వైద్యులను అభినందించారు.
ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్ప రుచుకొని ఏకాగ్రతతో చదివితే గమ్యం చేరుకోవడం సులభమవుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గురువా రం జూనియర్ కళాశాలలో సైబర్ క్రైంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని రహదారుల డివైడర్లు, రోడ్ల పక్కన కూడళ్ల ప్రాంతాల్లో గ్రామ దేవతలను పూజించేందుకు నిర్మించిన కట్టడాలను రామగుండం నగర పాలక యంత్రాంగం గురువారం తెల్లవారుజామున కూల్చివేసింది.
సింగరేణి యాజమాన్యం ఇటీవల 150మస్టర్లు ఉంటేనే రెగ్యులరైజేషన్ చేస్తామని తీసుకువచ్చిన సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబరు 23న యాజమాన్యం విడుదల చేసిన సర్క్యూలర్ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు.
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని మంత్రి శ్రీధర్‌బాబు క్యాంపు ఆఫీసు ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ శ్రేణులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి రైల్వే జంక్షన్‌తోపాటు బైపాస్ స్టేషన్‌ను మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ సందర్శించారు. స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించారు.
పేద ప్రజల కోసం, స్వాతంత్య్ర సాధన కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) డిసెంబర్ 26న శత వసంతాల సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు.
మూడు రోజుల పాటు జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకురావద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో పత్తి కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశంలో మాటా ్లడుతూ పత్తి జిన్నింగ్ మిల్లు అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్ మిల్లర్లు, సీసీఐ, ప్రైవేటు కొనుగోలు నిలిపివేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇవాళ(మంగళవారం) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం.