మినీ మేడారంగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:43 PM
మేడారం తరువాత అతిపెద్ద జాతరగా గోదావరిఖని గోదావరి తీరం వద్ద జరుగ నున్న సమ్మక్కసారలమ్మ జాతరకు విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు.
గోదావరిఖని, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మేడారం తరువాత అతిపెద్ద జాతరగా గోదావరిఖని గోదావరి తీరం వద్ద జరుగ నున్న సమ్మక్కసారలమ్మ జాతరకు విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. శుక్రవారం జాతర ప్రాంగణం వద్ద విలేకరులతో మాట్లాడారు. గత ంలో జరిగిన జాతరకు 6లక్షల మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి 10లక్షల మంది హాజ రవుతారని అంచనా వేస్తున్నావన్నారు. ప్రతి జాతరకు తాత్కాలిక ప్రాతిపదికన రూ.2 నుంచి 3కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేయడం తరువాత మళ్ళీ జాతరకు నిధులుపెట్టడం పరిపాటి అయ్యిం దన్నారు. దీంతో గోదావరి తీరంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పా ట్లు చేయాలని నిర్ణయించామన్నారు. సింగరేణి సంస్థ రూ.7 నుంచి 8 కోట్లు వెచ్చించిందని, మున్సిపల్ కార్పొరేషన్ మరో రూ. 2కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. స్నానఘట్టాలు, షవర్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, పార్కింగ్‌కు జాతర అవసరాలకు సుమారు 25 ఎకరాల భూమిని చదును చేసి అందు బాటులోకి తీసుకువచ్చామన్నారు. జాతర ప్రాంగణంలో కమాండెంట్ కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామ న్నారు. గోదావరిఖని జాతరకు రహదారుల సౌకర్యంతోపాటు భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు గోదావరి నది ఉండటం వల్ల పెద్దఎత్తున భక్తులు హాజరవుతా రన్నారు. గోలివాడ లో కూడా రూ.3కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. తక్కళ్ళ పల్లి, వేంనూర్, రాణాపూర్‌లో కూడా జాతర్లు జరుగనున్నాయన్నారు. జాతర నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఈవో కాంతారెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఉన్నారు.